ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? నేటి నుండి కొత్త నిబంధన...

10:24 - October 31, 2018

హైదరాబాద్ : మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా ? అయితే బుధవారం నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పలు ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఒక రోజులో రూ. 20, 000 కన్నా ఎక్కువ డ్రా చేయకూడదని నిబంధన పెట్టింది.  ఇంతకుముందు రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. దీనితో ఎస్‌బీఐ ఖాతాదారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోవాలంటే వారు ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. 
ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు పెరిగిపోతుండడం...తదితర ఫిర్యాదులు రావడంతో బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ లకు అలవాటు పడాలని ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss