బాబు పర్యటన..విద్యార్థులతో పనులా ?

15:31 - July 28, 2018

శ్రీకాకుళం : సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఓ గ్రౌండ్ ను విద్యార్థుల చేత పరిశుభ్రం..ఇతర పనులు చేయించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పనులు చేస్తున్న దృశ్యాలను టెన్ టివి చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయడంతో ఈ ఘటనకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో ఓ గ్రౌండ్ ను శుభ్రం చేయడానికి షెడ్యూల్ కులాల వసతి గృహాలకు చెందిన విద్యార్థులను ఉపయోగించారు. వారితో మైదానంలో ఉన్న గడ్డిని తీసివేయడం.మట్టిని సరిచేయడం వంటి పనులను స్యయంగా క్రీడాశాఖ ఉపాధ్యాయులు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న టెన్ టివి అక్కడున్న ఉపాధ్యాయులను ప్రశ్నించింది. క్రీడాశాఖ అధికారుల ఆదేశాలతో ఈ పనులు చేయిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొనడం గమనార్హం. పాఠశాలలో ఉన్న 280 మంది విద్యార్థుల చేత పనులు చేయిస్తున్నారనే విషయాన్ని జిల్లా కలెక్టర్ కు సమాచారం అందచేసింది. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను తిరిగి బడుల్లోకి పంపించారు. 

Don't Miss