జాహ్నవి కాలేజ్‌ లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

17:44 - January 11, 2017

హైదరాబాద్‌ : నారాయణగూడలోని జాహ్నవి ఉమెన్స్‌ కాలేజీలో సంక్రాంతి సంబరాలు కలర్‌ఫుల్‌గా సాగాయి. జాహ్నవి కాలేజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగోలి పోటీల్లో విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్ధులు వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి - సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నేటి తరం విద్యార్ధులకు ఈ పండుగపై అవగాహన కల్పించడానికే రంగోలి పోటీలు నిర్వహించినట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది. ముగ్గుల పోటీల్లో విజేతలైన విద్యార్ధినులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కోట రమేష్‌ను కళాశాల కరస్పాండెంట్‌ పరమేశ్వర్‌ ఘనంగా సత్కరించారు.

Don't Miss