మొదటికి చేరిన సదావర్తి భూముల కథ

21:51 - September 20, 2017

గుంటూరు : సదావర్తి భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సోమవారం జరిగిన వేలం పాటలో భూములను దక్కించుకున్న పాటదారులు ఇప్పుడు వెనకడుగు వేశారు. తమపై వైసీపీ నేతలు ఆరోపణల చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, లోకేష్‌తో తమకు సంబంధం ఉందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని వేలం పాటలో భూములను దక్కించుకున్న శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. అందుకే భూములను తీసుకోరాదని నిర్ణయించామని తెలిపారు. తమిళనాడులోని 83.11 ఎకరాల సదావర్తి సత్రం భూముల వేలంను సోమవారం నిర్వహించగా.. 60కోట్ల 30 లక్షలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ సంస్థకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, పద్మనాభయ్య దక్కించుకున్నారు. 

Don't Miss