టీటీడీలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలి : పీఠాధిపతులు

16:41 - June 9, 2018

చిత్తూరు : తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. తిరుమల పవిత్రతను, స్వామివారి కీర్తిని మరింత పెంచేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతులు తెలిపారు. టీటీడీలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదన్న పీఠాధిపతులు.. రమణదీక్షితులుపై కక్షసాధింపు సరికాదన్నారు. సిట్టింగ్‌ జడ్జితో కమిటీ వేసి శ్రీవారి ఆభరణాలు లెక్కించాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలు హిందువులను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిధులను ధార్మిక సంస్థలకే కేటాయించాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. త్వరలో అమరావతిలో పీఠాధిపతుల సమావేశం నిర్వహిస్తామన్నారు. తమ నిర్ణయాలను ప్రభుత్వాన్ని కలిసి వివరిస్తామని పీఠాధిపతులు తెలిపారు. 

 

Don't Miss