మెగా హీరో సరసన 'గురు' హీరోయిన్?..

11:49 - June 13, 2018

గురు చిత్రంలో తన నటనతో విమర్శకులు ప్రశంసల్ని అందుకున్న నటి రితికాసింగ్. చిత్రం ప్రారంభంలో అల్లరి, ఆకతాయి పిల్లగా..తరువాత పరిణితి సాధించిన యువతిగా రితికాసింగ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేశ్ పై కోపం, అసహనం అనంతరం ప్రేమ వంటి పలు కోణాల్లో రితికా సింగ్ చక్కగా నటించింది. అంతేకాదు అచ్చమైన బస్తీ అమ్మాయిగా రితికా నటన, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. అక్కను బాక్సర్ ను చేసేందుకు శ్రమించిన యువతిగా..తరువాత తానే బాక్సర్ అయిన నేపథ్యంలో రితికా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో 'గురు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ త్వరలో సాయి ధరం తేజ్ సరసన నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరంతేజ్ నటించే చిత్రంలో నాయికగా రితికాను తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం కామెడీ మరియు ఎమోషన్స్ తో కూడుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సినిమా పరిశ్రమ వర్గాల సమాచారం. 

Don't Miss