ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటున్న సాయి పల్లవి..

నువ్వు నాకు నచ్చావ్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటూ 'సాయి పల్లవి' అంటోంది. రియల్ లైఫ్ లో కాదు లెండి..రీల్ లైఫ్ లో. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా'లో 'సాయి పల్లవి' నటనతో దుమ్మురేపింది. ఆమె పలికిన డైలాగ్స్..హావభావాలతో అందర్నీ ఆకట్టుకుంది. దీనితో ఆమెను తమ చిత్రాల్లో నటింప చేయాలని పలువురు దర్శకులు..నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'దిల్' రాజు నిర్మాణంలో 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ‘నాని’ హీరోగా..'సాయి పల్లవి' హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు మంచి స్పందనే వస్తోంది. ఎంసీఏ అంటే 'మిడిల్ క్లాస్ అబ్బాయని' అంటూ నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. కథానాయిక సాయి పల్లవి 'నువ్వు నాకు నచ్చావ్. ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్' అని నానిని అడిగిన మాట కూడా హైలైట్గా నిలిచింది. ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.