సాక్ష్యం మూవీ రివ్వ్యూ..

19:09 - July 27, 2018

హాయ్ ఆల్ ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల . రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఈరోజు కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ '''సాక్ష్యం'' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బెల్ల కొండ సాయి శ్రీనివాస్ మూడు సినిమాల అనుభవంతో నాలుగోవ సినిమాతో ఈ రోజు థియోటర్ లోకి వచ్చాడు. భారీ బడ్జెట్‌తో టెర్రిఫిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా విడుదలవుతుంది... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముందు సినిమా 'జయ జానకి నాయక' బాక్సాఫీసు వద్ద ఫర్వలేదనిపించింది. అదే హొప్ తో హీరోగ తనలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బెల్లంకొండ..

మూడే మూడు సినిమాలు అన్ని సినిమాలకు భారీగానే బడ్జెట్ పెట్టారు.. స్టార్ హీరోయిన్లతో పాటు, స్టార్ యాక్టర్స్ అందరూ ఆ మూడు సినిమాల్లో ఉన్నారు.. దాంతో బెల్లంకొండ మూడు సినిమాలు యావరేజ్ టాక్ సాధించుకున్నాయి.. అయితే ఇప్పుడు ముందు సినిమాలనుమించిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించారు.

లక్ష్యం, లౌక్యం.. రామరామ కృష్ణ కృష్ణ, డిక్టెటర్ లాంటి వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ ను డైరక్ట్ చేసిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకుడు.. అంతే కాదు బలయ్యసినిమాను డైరక్ట్ చేసిన బోయపాటి సాయి శ్రీనివాస్ తో జయజానకీ నాయకా తీస్తే.. అదే బాలయ్యతో డిక్టేటర్ చేసిన శ్రీవాస్ ఇప్పుడు సాక్ష్యంతో మన ముందకు వచ్చాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్స్, అండ్ ప్రమోషనల్ వీడియోస్ అన్ని ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుందన్న సిగ్నెల్స్ ఇచ్చాయి..

బెల్లంకోండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గావచ్చిన ఈ మూవీలో శరత్ కుమార్ జగపతిబాబు, మీన, రావు రమేజ్, అషితోష్ రాణ, వెన్నెల కిశోర్, రవికిషన్.. బ్రహ్మాజీ, జయప్రకాశ్, సమీర్, పవిత్ర లోకేష్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు వర్క్ చేశారు.

అర్జున్ రెడ్డి మూవీకి అద్భతమైన బాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. చిరంజీవి చిన్నల్లుడు హీరోగా పరిచయం అయిన విజేత చిత్రానికి కూడా సంగీతం అందించాడు రామేశ్వర్..

మరి ఈ మూవీ ఆ టీమ్ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.. అంతే కాదు ఈ వీక్ ఎండ్ లో ఈ మూవీతో పాటు మెగా హీరోయిన్ హ్యాపి వెడ్డింగ్ కూడా లైన్ లో ఉంది.. ఇటు సాక్ష్యం.. అటు హ్యాపీ వెడ్డింగ్ రెండు సినిమాలు మంచి బ్యాగ్రౌండ్ తోనే వస్తున్నాయి.. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది.

ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత "" సాక్ష్యం’ " సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ ఇది....రేటింగ్..

Don't Miss