క్యా తుమ్హె యకీన్ హై అంటున్న సల్మాన్..

15:21 - April 19, 2017

‘క్యా తుమ్హె యకీన్ హై' అంటూ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రశ్నిస్తున్నాడు. తన తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భజరంగీ భాయిజాన్’, 'ఏక్తా టైగర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి చిత్రమైన ‘ట్యూబ్ లైట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర టీజర్..ట్రైలర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరులో టీజర్ విడుదల చేసి మేలో ట్రైలర్ ను విడుదల చేస్తామని ఇటీవలే దర్శకుడు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా బుధవారం ‘సల్మాన్’ ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. బ్యాక్ లుక్ తో ఉన్న ఈ ఫొటోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్ సోషల్ మాధ్యలో ట్రెండీ మారిపోయింది. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్, లడక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో షూటింగ్ చిత్రీకరించారు. సల్మాన్ సరసన చైనీస్ హీరోయిన్ జూ జూ నటిస్తోంది.

Don't Miss