సమంత...డిఫరెంట్ రోల్

11:49 - January 10, 2017

చెన్నై బ్యూటీ సమంత ప్రెస్టిజియస్ మూవీలో నటించబోతుంది. ఇప్పటి వరకు చిలిపి పాత్రలతో కవ్వించిన ఈ బ్యూటీ ఫస్ట్ టైం డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీపై సమంత స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ చెన్నైబ్యూటీ కొత్త సినిమా కోసం చేస్తున్న ఆ డిఫరెంట్ రోల్ ఏంటో మీరే చూడండి.
కొత్త సినిమాకి సమంత సైన్ 
జనతా గ్యారేజ్ తరువాత సమంత నటించబోతున్న కొత్త సినిమా ఏంటో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే లేటేస్ట్ ఈ బ్యూటీ ఓ కొత్త సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలోనే సమంత డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతున్నట్లు వినికిడి.
కీలక పాత్రలో సమంత 
మహానటి అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర కోసం విద్యాబాలన్, నిత్యామీనన్, సమంత ఇలాంటి పరువురు క్రేజీ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ ఆఖరి ఆ అద్భుత అవకాశం మరో చైన్నై చిన్నది కీర్తిసురేష్ ని వరించింది. మహానటి చిత్రంలో సావిత్రిగా కీర్తిసురేష్ నటించబోతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో సమంత నటించనుందని తెలిసింది. మహానటి సావిత్రి జీవితకథను రాసే జర్నలిస్టు పాత్రలో ఈ బ్యూటీ కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ పాత్రలో నటించడానికి శామ్ తన అంగీకారం కూడా తెలిపినట్లు సౌత్ లో టాక్ వినిపిస్తోంది. 
లీడ్ క్యారెక్టర్ లో సమంత
సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలో లీడ్ క్యారెక్టర్ మాత్రం సమంతదే అని తెలుస్తోంది. సమంత చేయనున్న జర్నలిస్ట్ పాత్ర కోణంలోనే సావిత్రి మూవీ సాగుతోందని చిత్రవర్గాల సమాచారం. అందుకే అబెక్షన్ చేయకుండా శామ్ ఈ పాత్రకు ఒకే చెప్పిందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటులు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, జెమినీ గణేషన్‌ల పాత్రలు కూడా ఉంటాయని వినిపిస్తోంది. వీరి పాత్రలే ఈ సినిమాకు కీలకమని తెలుస్తోంది. మరి ఈ పాత్రలను ఇప్పుడున్న యంగ్ స్టర్స్ లో ఎవరూ కనిపించబోతున్నరనేది ఇంట్రెస్ట్ గా మారింది.

 

Don't Miss