'సమ్మోహనం' సినిమా రివ్వ్యూ..

17:58 - June 15, 2018

అష్టా చమ్మా నుండి క్లాస్ కథలకు తనదైన శైలిలో హ్యూమర్ జోడిస్తూ.. విజయాలు అందుకుంటున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుండి వచ్చిన మరో మెచ్యూర్డ్ కూల్ బ్రిజ్ లవ్ ఎంటర్టైనర్ సమ్మోహనం.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమాలో సుధీర్ బాబు, అథితిరావ్ హైదరీ హీరో హీరోయిన్స్ గా నటించారు.. సమ్మోహనం పేరుకు తగ్గట్టే ఆడియన్స్ ను సమ్మోహన పరిచిందా.. లేదా.. నిరాశపరిచిందా.. అనేది ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే.. సినిమాలు అన్నా సినిమా మనుషులు అన్నా.. సదాభిప్రాయం లేని విజయ్.. ఆర్ట్ ని తన కెరీర్ ను ఎంచుకుంటాడు.. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వలన టాప్ స్టార్ హీరోయిన్ సమీరా తో ఒక చిన్న జర్నీ ఏర్పడుతుంది.. ఆ జర్నీలో అనుకోకుండా ఆమెతో ప్రేమలో పడతాడు విజయ్. అదే విషయాన్ని సమీరాకు చెపుతాడు.. ఆమె కూడా విజయ్ ను లవ్ చేసినప్పటికి, విజయ్ ప్రపోజల్ ను రిజక్ట్ చేస్తుంది.. అసలు సమీర విజయ్ లవ్ ను ఎందుకు రిజక్ట్ చేసింది.. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. చివరకు సమీరా, విజయ్ ఎలా ఒకటి అయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

నటీనటుల విషయానికి వస్తే.. ఈ మూవీకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.. అథితీరావ్ హైదరీ. ఈ సినిమా పరంగా చూసుకుంటే.. హీరోయిన్ అయినప్పటికీ.. సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ గా ఉండి నడిపించింది.. ఇంతకు ముందు చెలియా.. పద్మావత్ సినిమాలలోని తన అభినయంతో ఆకట్టుకున్న అథితీ.. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ లుక్ తో సినిమాకు అవసరం అయిన మ్యాజిక్ క్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యింది.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో ఆమె పండించిన సటిల్డ్ ఎక్స్ ప్రెషన్స్ మెన్మరైజింగ్ గా ఉన్నాయి.. ఇక హీరో సుధీర్ బాబు విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటన పరంగా చాలా మెచ్యూరిటీ చూపించాడు.. లవ్ డ్రామాను పండించడానికి ఇబ్బంది పడే సుధీర్ బాబు.. ఈ సినిమాలో మాత్రం.. ఆ డ్రా బ్యాక్ ను ఓవర్ కమ్ చేయగలిగాడు.. ఎమోషనల్ సీన్స్ లో సైతం మెలో డ్రామాను పండించగలిగాడు.. ఇక సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ కి చాలా కాలం తరువాత సినిమాను నిలబెట్టే పాత్ర దక్కింది.. అతని క్యారక్టర్, ఆక్యారక్టర్ లో అతని పర్ఫామెన్స్ సమ్మోహనానికి సేవియర్ పాయింట్. ఇక రాహుల్ రామకృష్ణ, కాదంబరీ అభయ్, ఇలా వీళ్లంతా కలసి... తలో చేయి వేసి ఆడియన్స్ ను నవ్వించారు.. సినిమాను ముందుకు నడిపించారు.. పవిత్రా లోకేష్.. హరితేజ,. తనికెళ్ళ భరణీ.. తదితరులంతా.. పాత్రల పరిధి మేర డిగ్నిఫైడ్ పర్ఫామెన్స్ ఇచ్చారు..

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినమాకు కర్తా, కర్మా, క్రియా అయిన మోహన కృష్ణ ఇంద్రగండి.. ఫస్ట్ పాయింట్ నుండి తన గ్రిప్ ను చూపించారు.. తన స్టైల్, హ్యూమర్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ.. లీడ్ పేయిర్ తో కనెక్ట్ అయ్యేలా మెచ్యూర్డ్ గా ఫస్ట్ ఆఫ్ ను నీట్ గా తీర్చి దిద్దాడు.. సెకండ్ ఆఫ్ కి వచ్చేప్పటికి.. హ్యూమర్ కంటెన్ట్ తగ్గడం తో పాటు హీరోయిన్ ప్లాష్ బ్యాక్ సీన్స్ అలాగే.హీరో రియలైజేషన్ సీన్స్ కాస్త సాగదీతగా అనిపించాయి అక్కడక్కడ కాస్త బ్రేక్స్ వేసినప్పటికీ.. ఓవర్ ఆల్ గా ముందు చెప్పినట్టుగా క్లాస్ అండ్ నీట్ ఎంటర్టైనర్ అందించడంలో సక్సెస్ అయ్యారు డైరక్టర్ ఇంద్రగంటి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. పెళ్ళిచూపులు ఫేమ్ వివేక్ సాగర్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ తో లవ్ ఫీల్ ను పదిరెట్లు పెంచాడు.. సాంగ్స్ కూడా సినిమాలో కలిసి పోయి, పోయిటిక్ గా సాగిపోయాయి..లిరిక్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్ గా ఉన్నాయి.. ఇక ఆర్ట్ డైరక్షన్ వర్క్ ఇంప్రసీవ్ గా ఉంది.. సినిమాటోగ్రర్ పి.జి.విందా.. ఈ సినిమాకు ఎసెట్.. డైరక్టర్ ఇంద్రగంటితో అతనికి ఉన్న వేవ్ లెంత్ మాచింగ్ వల్ల కలర్ ప్లేవర్ మిస్ కాలేదు.. ముఖ్యంగా టెర్రస్ సీన్స్, క్లైమాక్స్ లో అతని వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది.. ఎడిటింగ్ బాగుంది కాని ఇంకాస్త షార్ప్ గాఉంటే బెటర్ గా ఉండేది.. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే ఒక క్లాస్ అప్పీలింగ్ లవ్ ఎంటర్టైనర్.. గా తెరకెక్కిన సమ్మోహనం లవ్ ఎలిమెంట్స్ పరంగా, హ్యూమర్ ఎలిమెంట్స్ పరంగా, బాగా ఎంటర్టైన్ చేసినప్పటికి. స్లో నేరేషన్ అడ్డంకిగా నిలిచింది. మరి సమ్మోహన పరిచింది అని అనలేక పోయిన అలరిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు..

 

ప్లస్ పాయింట్స్

లవ్ సీన్స్, డైరక్షన్

హీరో,హీరోయిన్ కెమిస్ట్రీ

కామెడీ, మ్యూజిక్

సినిమాటోగ్రఫి

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

నావెల్టి లేని కథ

స్లో నేరేషన్

ఊహాజనిత క్లైమాక్స్

కొన్ని డ్రాగింగ్ సీన్స్

సినిమా, సమ్మోహనం, అదితీ రావు హైదరీ, సుధీర్ బాబు,

 

 

 

Don't Miss