శాంసంగ్ గెలాక్సీ ఏ7 ఫోన్...

10:07 - September 26, 2018

ఎలక్ట్రానిక్ రంగంలో వివిధ కంపెనీలు వినూత్న పరికరాలు తయారు చేస్తూ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. అందులో ప్రముఖ కంపెనీగా పేరొందిన శాంసంగ్ వినూత్న స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో మూడు కెమెరాలు ఉండడం విశేషం. గెలాక్సీ ఏ7 పేరిట మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 4జీబీ వేరియంట్‌ ప్రారంభ ధరను కంపెనీ రూ.23,990గాను, 6 జీబీ వేరియంట్‌ ధర రూ. 28,990గాను కంపెనీ నిర్ణయింది. సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ షాపుల్లో ఇది లభ్యం కానుందని కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్‌ 29 నుంచి అన్ని ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లలోనూ ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. 6.0 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే....ఫోన్‌లో వెనుక వైపున 8 ఎంపీ, 24 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు..సెల్పీ కోసం ముందువైపు 24 ఎంపీ కెమేరా..2.2 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 7885 ప్రాసెసర్...3300 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, 7.5 ఎంఎం మందపు బాడీ అ ఫోన్‌ అదనపు ఫీచర్లు. వీటి మెమోరీని 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. 

Don't Miss