అమరావతిలో మట్టిమాఫియా ఆగడాలు

08:31 - November 14, 2017

గుంటూరు : మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రముఖ పుణ్యకేత్రమైన అమరావతి నది గర్భంలో మట్టి మాఫియా అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మట్టి మాఫియా ఆగడాలను అధికార యంత్రాంగం అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఇసుక మాఫియా
అమరావతిలో అక్రమార్కులు 
అమరావతిలో అక్రమార్కులు మట్టిని కొల్లగొడుతున్నారు. అమరేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ వద్ద నుండి గత పది రోజుల నుంచి మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో చాలా సార్లు తహశీల్దార్‌కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. తాత్కాలికంగా వీఆర్వోని పంపినా మళ్లీ యధాతథంగా తవ్వకం మొదలుపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న 10 టీవీ.. మట్టి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఘటనా స్థలానికి వెళ్లింది. అయితే అక్కడి అక్రమార్కులు.. పెద్దపెద్దవి తీయకుండా నాల్గొందల రూపాయలకు మట్టి అమ్ముకునే తమవి తీయడమేంటని ఎదురు ప్రశ్నించారు. 
ట్రాక్టర్లతో మట్టి తరలింపు 
రాత్రి వేళల్లో ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇదంతా తెలిసినా పోలీసులు, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి తవ్వకం 10రోజుల నుంచి దాదాపుగా 100ట్రాక్టర్ల నుంచి 5000 ట్రాక్టర్ల వరకు తరలించినట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దళితుల భూములు, లంకభూములు కనుమరుగైపోతున్నాయని దళితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

Don't Miss