మద్యం షాపు ఏర్పాటులో ఉద్రిక్తత

10:51 - October 4, 2017

సంగారెడ్డి : అక్కడ మద్యం షాపు వివాదం చినికి చినికి ఉగ్రరూపం దాల్చుతోంది. జనావాసాల్లో మద్యం షాపు పెట్టవద్దని స్థానికులు అంటుండగా.. పెట్టి తీరతామంటున్నారు మద్యం షాపు టెండర్లు దక్కించుకున్న యజమానులు. సంగారెడ్డిలో ఓ వైన్ షాపు ఏర్పాటులో నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం షాపు టెండర్‌ దక్కించుకోవటమే ఆలస్యం.. లాభాలు దండుకోవాలనే ఆరాటంలో షాపు యజమానులు అనుమతులు లేకుండానే నిర్మాణాలకు పూనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణం కూడా మద్యం షాపు కోసమే.

కలెక్టరేట్ దగ్గర్లోనే...
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అదీ కలెక్టరేట్ దగ్గర్లోనే ఈ మద్యం షాపు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. 10టీవీ ఇచ్చిన సమాచారంతో మున్సిపల్ కమిషనర్ స్పందించినా రెండు రాళ్లు తీయించి పక్కన పెట్టించారు. కానీ ఇక్కడి గణేశ్ నగర్ యువకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపు పెట్టనీయమని ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు, షాపు యజమానులు కుమ్మక్కై జనావాసాల మధ్య షాపులు పెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. 

Don't Miss