సానియామీర్జా తల్లి కాబోతోంది...

09:45 - April 24, 2018

ఢిల్లీ : భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ఓ పోస్ట్‌ చేశారు. పుట్టబోయే బిడ్డకు  మీర్జా మాలిక్‌ అనే పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ పోస్ట్‌ను అభిమానుల నుంచి తెగ లైక్స్‌, కామెండ్స్‌ వచ్చాయి.  సానియా ఆ విషయాన్ని పంచుకున్నలోపే... 54 వేలమంది లైక్‌ చేశారు. మరో 1502 మంది కామెంట్స్‌ చేశారు. సానియాను అభిమానులు శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు. 

 

Don't Miss