తణుకులో ఘనంగా సంక్రాంతి సంబరాలు

12:56 - January 10, 2017

పశ్చిమ గోదావరి : తణుకులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కాలేజీలో సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. బొమ్మలకొలువు, సంక్రాంతి పిండివంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు అందరిని ఆకట్టుకున్నాయి. వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో గత 10 ఏళ్ల నుంచి ఈ సంక్రాంతి సంబరాల్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాలేజీ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఈ సందర్బంగా సరళాదేవి అన్నారు. 

Don't Miss