దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన..

21:49 - April 23, 2018

ఢిల్లీ : కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనల నేపథ్యంలో పాక్సో చట్టాన్ని మరింత పటిష్టం చేయడానికి కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చినప్పటికి రేప్‌ ఘటనలు ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేట్‌ స్కూళ్లో చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి నడుస్తున్న కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు బాధితురాలి సమీప బంధువు కాగా మరొకడు సహ విద్యార్థి. స్కూలు బస్సు మిస్సవ్వడంతో కారులో లిఫ్ట్‌ ఇస్తామని నమ్మించిన ముగ్గురు మృగాళ్లు 11 గంటల పాటు రోడ్లపై తిరుగుతూ బాలికపై బలత్కారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో బాధితురాలిని నాలేడ్జ్‌ పార్క్‌ వద్ద నిర్మాణుష్యంగా ఉన్న రోడ్డుపై పారేసి పారిపోయారు. ఏప్రిల్‌ 18న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పాక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Don't Miss