అంగవైకల్యాన్ని జయించిన ధీరుడు స్టీఫెన్ హాకింగ్..

10:11 - March 14, 2018

హైదరాబాద్ : కొందరి మరణం సంచలనం. మరికొందరి మరణం మిస్టరీ. ఇంకొందరి మరణం మాత్రం ప్రపంచానికే లోటు మారిపోతుంది. ఇటువంటి అరుదైన,అద్భుతమైన, అద్వితీయమైన వ్యక్తులు అతి కొద్దిమంది మాత్రమే వుంటారు. అటువంటి అరుదైన అఖండ మేధావుల్లో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు వున్నారు. కానీ అరుదైన, మానవీయ మేధావి మాత్రం స్టీఫెన్ హాకింగ్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొందరి మేధస్సు వారి ఇంటికే పరిమితమవుతుంది. మరికొందరి మేధస్సు వారి వ్యాపార విస్తరణకు,వారి అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అతి కొద్దిమంది మాత్రమే ప్రపంచ మానవాళి మనుగడకు, వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదిగో అటువంటి మేధావుల్లో ప్రధముడిగా నిలుస్తారు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఖగోళ రంగంలో ఆయన ముద్రను ఎవ్వరు అధిగమించలేరు. అటువంటి మేధావిని కోల్పోయిన ప్రపంచం కేవలం ఒక మేధావినే కాదు అద్భుతమైన మానవత్వాన్ని కోల్పోయింది. 

స్టీఫెన్ హాకింగ్ మానవీయతకు నిలువెత్తు రూపం స్టీఫెన్ 
స్టీఫెన్ హాకింగ్ మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో తనను కునారిల్లేలా చేయిన అంగవైకల్యాన్ని సైతనం ఓడించి.. దాన్ని సవాల్ చేసిన నిలబడిన ఆత్మవిశ్వానికి నిలువెత్తు నిదర్శనం స్టీఫెన్ హాకింగ్. ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే` ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ, అఖండ మేధస్సుకు నిలువెత్తు నిదర్శనం స్టీఫెన్ హాకింగ్ అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న జీవిత. కానీ ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…నిత్యం చైతన్య జ్వలితం ఆయన జీవితం. ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శవంతంగా ఆయన జీవితం.
ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ జనించిన స్టీఫెన్ :
నిత్య చైతన్యం ఆయన మేధస్సు. తేజోరూపం స్టీఫెన్ హాకింగ్. రిగ్గా ఇదే రోజు 1942 జనవరి 8న ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ ఆయన జన్మించిన ఆయన తండ్రి లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. అక్కడే స్టీఫెన్ జన్మించారు. భౌతిక శాస్త్రం డిగ్రీ అందుకున్న స్టీఫెన్ 1962లో కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ ఫర్ద్ కి వెళ్ళారు.
`మోటార్ న్యూరాన్ వ్యాధి` బారిన పడిన స్టీఫెన్

త్వరలోనే పి.హెచ్.డి అందుకోవాల్సిన సమయంలో స్టీఫెన్ ను తీవ్రమైన వ్యాధి వెంటాడింది. స్టీఫెన్ శరీరం ఏ పనికీ సహకరించలేదు. పరీక్షలు చేసిన వైద్య నిపుణులు స్టీఫెన్ కు భయంకరమైన `మోటార్ న్యూరాన్ వ్యాధి` సోకినట్టు నిర్ధారించారు. నరాలు, వెన్నపూసపై ప్రభావం చూపించే ఈ వ్యాధిని `ఆర్మీట్రోఫిక్ లేటరల్ స్కిలోరోసిస్` అని కూడా అంటారు. డాక్టరేట్ కూడా అందుకోకుండానే స్టీఫెన్ మరణించవచ్చని అందరూ భావించారు. అయితే, విధిని ఎదిరించారు. మొక్కవోని దీక్షతో, పట్టుదలతో పిహెచ్ డి పూర్తి చేయటమే కాక ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచానికి అందించారు. ఆయన `కృష్ణ బిలాలు`పై పరిశోధన చేసి అనేక ఫలితాలను రాబట్టారు. `హాకింగ్స్ రేడియేషన్` గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. 1970 నుంచి ఆయన కృష్ణ బిలాలపై పరిశోధనలు చేశారు. జనరల్ రిలేటివిటి, క్వాంటమ్ థియరీ ఆధారంగా కృష్ణ బిలాలు కూడా `ధార్మిక శక్తి`ని కలిగి ఉంటాయని తన పరిశోధనల ద్వారా తెలియచెప్పారు.
`కృష్ణ బిలాల`కు సంబంధించి పలు రచనలు :
1971 నుంచి `బిగ్ బ్యాంగ్`పై పరిశోధనలు ప్రారంభించిన ఆయన `కృష్ణ బిలాల`కు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ పుస్తకరచన ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే `ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ రచనను పూర్తి చేసి 1988లో ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో విడుదలైన ఆ పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. `కాలం కథ` పేరుతో తెలుగులో కూడా ఆ పుస్తకం విడుదలైంది. పదేళ్ళ తరువాత 1998 లో ఆ పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 1975 నుంచి 2006 వరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారు. 1975లో ఎడింటంగ్ అవార్డు అందుకున్న ఆయన ఆ తరువాత రాయల్ సొసైటీ హ్యుస్ మెడల్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, కంపానియన్ ఆఫ్ ఆనర్, రాయల్ సొసైటీ కాప్లీ వంటి అనేక ప్రసిద్ధ అవార్డులను అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా అనేక సేవలందించిన స్టీఫెన్ హాకింగ్ మృతి చెందటం ప్రపంచానికే లోటు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Don't Miss