రాజకీయాల్లోకి 'అంజలి’..

11:00 - November 8, 2017

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్...ఇలా పలు వుడ్ లకు సంబంధించిన కథనాయకుడు...కథా నాయికలు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోలు..హీరోయిన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కూడా. తమిళనాడులో 'కమల్ హాసన్' పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘రజనీకాంత్' కూడా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే 'అంజలి' కూడా రాజకీయాల్లోకి వస్తారంట. రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో ...

'షాపింగ్ మాల్‌’, 'జ‌ర్నీ’, 'గీతాంజ‌లి’, 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’, 'డిక్టేట‌ర్' వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన 'అంజలి' తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకొంటోంది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రంలో రెండు పాత్రలను పోషిస్తోంది. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా 'అల్లుడు సింగం’. సినిమా రూపొందుతోంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. 'అల్లుడు సింగం' లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోందని, లాయర్‌, రాజకీయ నేతగా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతుందని రావిపాటి పేర్కొన్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది' అని అన్నారు.

Don't Miss