నన్ను చంపేయకండి..

10:51 - November 11, 2017

నన్ను చంపేయకండి..బతికే ఉన్నా అంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు. తన కామెడీ నటనతో..విలనిజంతో ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయనపై గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారని..ఆయన కన్నుమూశారని పుకార్లు షికారు చేశాయి. దీనితో కోట శ్రీనివాస రావు మీడియా ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా చిలన చిత్ర రంగంలో ఉన్నానని..ఎందుకో తనపై ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై బంధువులు..స్నేహితులు వాకబు చేస్తున్నారని..ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. వయసు రీత్యా మెట్లు ఎక్కలేనని...కూర్చొనే చేసే పాత్రలు చేయగలనని చెప్పడంతో వారు కూడా అలాంటి పాత్రలే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవలే కామెడీ నటుడు వేణు మాధవ్ పై కూడా ఇలాంటి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోట శ్రీనివాస్ రావు స్పందనతో ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss