తెల్లారి ఇంటికొచ్చిన 'అన్నపూర్ణ' అల్లుడు...

17:43 - July 28, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కీర్తి నిద్రపోతుండటంతో ఆయన వేరే గదిలో పడుకొన్నారు. ఉదయం నిద్ర లేచే సరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు ఆయన తెలిపారు. వెంటనే పక్కనే గోదావరి బ్లాక్‌లో నివాసం ఉంటున్న అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కీర్తి ఆరోగ్యం సరిగా లేదని.. దీనికి సంబంధించి మందులు సైతం తీసుకుంటున్నారని వెంకటకృష్ణ పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

Don't Miss