'ట్యూబ్ లైట్'లో షారూఖ్ ?

09:36 - May 17, 2017

బాలీవుడ్ సినిమాల్లో హీరోలు వారి చిత్రాల్లోనే కాకుండా ఇతరుల చిత్రాల్లో కూడా నటిస్తుంటారు. ఏమాత్రం భేషజాలకు పోకుండా ప్రముఖుల హీరోలతో సైతం నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంటారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్..షారూఖ్ ఖాన్ త్రయం నటించారంటే అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా 'సల్లూ భాయ్' నటిస్తున్న 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'షారూఖ్' ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. సినిమాకు సంబంధించిన లుక్స్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సోహైల్ ఖాన్, చైనా నటి చూచూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం వ్యక్తిగత ఎమోజి కలిగిన తొలి బాలీవుడ్ చిత్రంగా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని కబీర్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ట్విట్టర్ లో 'ట్యూబ్ లైట్ కీ ఈద్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసినప్పుడు ఈ ఎమోజీ కనిపిస్తుంది. సల్మాన్ మెడకు బూట్లు ధరించి సెల్యూట్ చేస్తూ బొమ్మ రూపంలో కనబడుతాడు. భారత్ - చైనా సరిహద్దు నేపథ్యంలో సినిమా ఉంటుందని, రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Don't Miss