శరద్ యాదవ్ ను తప్పించండి : జేడీయూ ఎంపీలు

15:57 - August 12, 2017

ఢిల్లీ : బిహార్‌లో బిజెపితో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్‌పై నితీష్‌వర్గం చర్యలకు ఉపక్రమించింది. జెడియుకు చెందిన ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసారు. రాజ్యసభలో జెడియు నేతగా శరద్‌యాదవ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఆర్‌సిపి సింగ్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో జెడియుకు 10 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో అలీ అన్వర్‌ను సస్పెండ్‌ చేయగా... నితీష్‌ వైఖరిని నిరసిస్తూ కేరళకు చెందిన ఎంపి వీరేంద్ర కుమార్‌ కూడా పార్టీకి దూరమయ్యారు. ఆగస్టు 19న జెడియు జాతీయ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి శరద్‌యాదవ్‌ హాజరు కాకుంటే పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేరోజు ఎన్డీయేలో చేరే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది.

Don't Miss