రూ.10 క్యాబేజీ కొనటానికి వెళితే కోటిన్నర లాటరీ..

15:31 - December 5, 2018

అమెరికా : సూపర్ మార్కెట్ కు ఎందుకెళతాం కావాల్సిన వస్తువలు కొనుకోవటానికి. అలా సూపర్ మార్కెట్ కు వెళ్లిన ఓ మహిళకు అనుకోని విధంగా జాక్ పాట్ తగింది. ఇంకేముంది? ఆమె సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంతోషం పట్టలేకపోతోంది. మేరీల్యాండ్ లో వుంటున్న ఓ మహిళ క్యాబేజీ కొనటానికి సూపర్ మార్కెట్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు దుకాణదారులు ఓ స్పిన్ స్క్రాచ్-ఆఫ్ టిక్కెట్ ను ఇచ్చారు. కార్డ్ తీసుకున్న ఆమె ఇంటికి వెళ్లి ఆ కార్డ్ ను స్ర్కాచ్ చేసింది. ఇంకేముంది? ఆనందం, ఆశ్చర్యం ఒక్కసారిగా వెల్లువెత్తాయి ఆమెకు. $ 225 వేల డాలర్లు ఆమెకు లాటరీ తగిలిందని తెలిసింది. కాగా ఆ స్ర్కాచ్ కార్డ్ వార్డ్ వర్జీనియాకు చెందిన ఓ లాటరీ కంపెనీవారు సదరు సూపర్ మార్కెట్ కు ప్రొవైడ్ చేశారు. ఆ కార్డ్ ను స్ర్కాచ్ చేసిన మహిళకు ఆ పెద్ద మొత్తం లాటరీ తగిలింది. మన కరెన్సీ లెక్కన చూస్తే ఆ మొత్తం దాదాపు రూ.1.5 కోట్లు!!!.
మేరీ ల్యాండ్ లోని టెంపుల్ హిల్స్ లో నివాసముండే వెనెస్సా.. ఇటీవలే ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. ఉద్యోగ విరమణ తరువాత అనుకోకుండా దక్కిన ఈ పెద్ద మొత్తంతో తాను ఎప్పటి నుండి చూడాలనుకుంటున్న డిస్నీ వరల్డ్ కు వెళతానంటు ఆనందంగా చెబుతోంది. కాగా ఒకొక్కసారి మనం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కానీ మరోసారి మనం ఏమీ చేయకపోయినా అదృష్టం కోరి వరిస్తుంది. దీన్ని అదృష్టం అనుకోవాలా? లేదా ఎప్పుడో పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకోవాలో అర్థం కాదు. ఏది ఏమైనా తనకు దక్కిన అదృష్టానికి మురిసిపోతోంది వెనెస్సా. అంతేమరి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అదృష్టం వరిస్తుందో చెప్పలేం. వెనెస్సా జీవితాన్న్కుని ఈ లాటరీ పూర్తిగా మార్చివేసింది.  

 

Don't Miss