ఐదుగురు ఆడపిల్లల పరిస్థితి కడు దయనీయం...

13:27 - August 18, 2016

ఒకే ఒక చిరు కోరిక. ఆ దంపతులను ఆలోచించకుండా చేసింది. అదే వారికి పెద్ద భారమైంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు..వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు..కొడుకు కావాలన్న కోరిక ఉండవచ్చు కానీ నిరక్షరాస్యులైన వారికి అవగాహన లేక కొడుకు పుడుతాడన్న ఆశతో ఆడపిల్లలకు జన్మనిస్తూ పోయారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పుట్టడంతో వారి నిరుపేద తనానికి తోడు సమస్యలు మొదలయ్యాయి. మరింత ఆర్థికంగా కష్టాల్లో కూరుకపోయిన దంపతులు పిల్లను పోషించే పరిస్థితి లేక ఒకరి తరువాత ఒకరు ఏడాదిలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆలు..మగలు చేసే తప్పులు పిల్లలకు జీవితాంతం శిక్ష పడుతుందని ఈ చిన్నారులను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లల పరిస్థితి కడుదయనీయం. పని చేసే వయస్సు కాదు..ముద్దలు కలిపి తినే బాల్యంలోనే ఆ పసిబిడ్డలకు దిక్కేది. ? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చిన్నారులకు సాయం అందించాలంటే...
మడితప శిరీష.. D/O శివయ్య
ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబర్ 2304 10 1000 16549
IFSC ANDB 0002304
రాఘవరాజపురం.
రైల్వే కోడూరు, కడప జిల్లా.

Don't Miss