సులభమైన వ్యాయామాలు..

12:54 - May 16, 2017

ఉరుకుల పరుగుల జీవితంలో ఇక వ్యాయామానికి టైం ఎక్కడిది అని చాలా మంది అంటుంటారు. కానీ కొద్ది సమయంలోనైనా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం కొద్దిగానైనా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా టైం కేటాయించకుండానే

సులభమైన వ్యాయామాలు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. మరి ఆ సులభమైన వ్యాయామాలు ఏంటీ ? ఎలా చేయాలి .
ముఖ్యమైన పని నడవాలి. ఇందుకు ప్రత్యేకంగా టైం కేటాయించాల్సినవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీ ఆఫీసు దగ్గరలోనే ఉంటే నడుచుకుంటూ వెళ్లండి. లిఫ్ట్ ఎక్కువ శాతం ఉపయోగించకండి. మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లండి. ఇలా చేయడం వల్ల క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. కొవ్వు కూడా కరిగిపోయే అవకాశం ఉంది.
కేవలం వంట స్త్రీలే చేయాలా ? మగవారు చేయవద్దా ? ట్రై చేయండి. వంట చేయడం వల్ల 105 క్యాలరీల ఖర్చు అవుతుంది. కూరగాయాలు తీసుకోవడం..కట్ చేయడం..వంటివి చిన్న చిన్న పనులు చేయండి. ఒక రకంగా ఇది ఒక వ్యాయామం లాంటిదే.
మీరు ఉండే గదిని పని వారు..ఇతరులు క్లీన్ చేయడం కంటే మీరే చేసుకోండి. గదిలో ఉండే పుస్తకాలు..బట్టలు..అలంకరణ వస్తువులు శుభ్రంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల 100 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది.
పని చేసే సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఓ సారి కూర్చొన్న చోటనే 108 డీగ్రిల కోణంలో అటూఇటూ కదిలితే సరిపోతుంది. దీని వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవటంతో పాటు మానసికంగా ఒత్తిడికి దూరం అవుతారు.

Don't Miss