అత్త పాత్రలో 'గ్లామర్' హీరోయిన్?!..

12:48 - April 11, 2018

మానాన్నకు పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి..తెలుగు ప్రేక్షకులను గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ప్రభావితం చేసిన కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన అవలీలగా చాన్స్ లు కొట్టేసి గ్లామర్ గాల్ గా మెప్పించి 'సమర సింహా రెడ్డి' .. 'కలిసుందాం రా' .. 'నరసింహనాయుడు' .. 'మృగరాజు' వంటి సినిమాలు ఆమె అగ్రకథానాయకులతో చేసింది. అటువంటి సిమ్రాన్ వివాహం తరువాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. కానీ తమిళంలో కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, అక్కడ ముఖ్యమైన పాత్రలను చేస్తోంది.

గ్లామర్ గా కనిపిస్తున్న అమ్మ,అత్త పాత్రలు..
ప్రస్తుతం తెలుగు తెరపై అమ్మ, అత్త క్యారక్టర్లంటే హీరోయిన్ కు అక్కల్లాగా కనిపించేంత గ్లామర్ గా కనిపిస్తున్నాయి. ప్రగతి,రాశి,తులసి,రోహిణి వంటి మంచి నటీమణులు అత్తలుగా, అమ్మలుగా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో సిమ్రాన్ కూడా అత్త పాత్రలో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక తెలుగు సినిమాను కూడా సిమ్రాన్ అంగీకరించిందనీ .. అందులో అత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను ఓకే చెసినట్టు తెలుస్తోంది. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.        

Don't Miss