మంత్రి కేటీఆర్ ఇలాఖాలో...

17:32 - August 27, 2017

కరీంనగర్ : పేదల..మధ్య తరగతి పథకాల్లో లబ్ది పొందాలంటే అధికారులు..సిబ్బందికి డబ్బులు అందచేయాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇలాఖాలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే సిరిసిల్లలో ఇసుక మాఫియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

తాజాగా సిరిసిల్లలో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. వివాహ ధృవీకరణ పత్రాల కోసం వస్తున్న వారి నుండి డబ్బులు దండుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లకు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇందుకు సిబ్బంది రుసుం కింద రూ. 200 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రూ. 200 బదులు రూ. 500 వసూలు చేస్తుండడంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. మరి ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Don't Miss