అమరావతిలో అద్భుతం : నేరస్థులను పట్టించేసే స్తంభం!!..

09:41 - November 30, 2018

అమరావతి : నేరస్థుల్ని పట్టించేదెవరు? అంటే ఆ బాధ్యత పోలీస్ శాఖదే అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ టెక్నాలజీని వినియోగించుకోవటంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓ వినూత్న ప్రయోగం ఇప్పుడు ప్రత్యేకతను చాటుతోంది. అదే నేరస్థులను పట్టించేందుకు సహకరించే ‘స్మార్ట్ పోల్’. ఇది ఏ అభివృద్ది చెందిన అమెరికాలోనే లేక ఏ యూరప్ దేశాల్లోనో కాదు..ఏపీ రాజధాని అమరావతిలో వుంది ఈ స్మార్ట్ పోల్. 
సచివాలయంలోని మూడో బ్లాక్‌ ఎదుట ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ పోల్‌ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.  రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ ఈ స్మార్ట్ పోల్ ను ఏర్పాటు చేసింది. 
స్మార్ట్ పోల్ ప్రత్యేకతలు..
ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ విద్యుత్తు స్తంభానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విద్యుత్తు ఛార్జీతో కూడిన బ్యాటరీతో పాటు   ఎల్‌ఈడీ బల్బు కూడా ఈ స్తంభానికి అమర్చి వుంటుంది. కానీ కరెంట్ లేకపోయినా ఒ గంట సయమం పాటు ఈ పోల్ కు అమర్చిన ఎల్‌ఈడీ బల్బు వెలుగుతుంది.
స్తంభానికి 10 సీసీ కెమెరాలు..
స్తంభానికి కింది భాగంలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి మనుషుల ముఖకవళికలను స్పష్టంగా గుర్తిస్తాయట. పోలీసుల వద్దనున్న నేరస్థుల డాటాను దీనికి అనుసంధానం చేస్తే ఈ పోల్‌ పరిసరాల్లోని నేరస్థులను పసిగట్టి కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇస్తుంది ఈ స్మార్ట్ పోల్.  అంతేకాదు కార్ల నంబర్‌ ప్లేట్స్ ను కూడా ఈ సీసీ కెమెరాలు గుర్తిస్తాయి. వేడి, గాలిలో తేమ లాంటి వివరాలు స్తంభానికి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ తెరపై ప్రదర్శితమవుతాయి. ఈ స్మార్ట్ పోల్ కూడా పోలీస్ డ్యూటీ చేసేస్తోందన్నమాట. 
 

Don't Miss