రాహుల్‌గాంధీ ప్రసంగంపై స్మృతీ ఇరానీ స్పందన

21:58 - September 12, 2017

ఢిల్లీ : కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు.  భారత్‌లో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమేనని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నవారికి ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేవన్నారు. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోది పేద కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారని, రాష్ట్రపతి కోవింద్‌ దళిత కుటుంబం నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవారేనని మంత్రి తెలిపారు. వీరంతా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన ఈ స్థాయికి ఎదిగారని స్మృతీ అన్నారు. ప్రజాస్వామ్యంలో వారసత్వానికి తావులేదని ప్రతిభే కొలమానమని చెప్పుకొచ్చారు. 

Don't Miss