చద్దన్నం మేలు..

13:17 - May 22, 2017

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొంతమంది టిఫిన్ అంటే ఉప్మా..పూరీ..దోస..ఇడ్లీ..ఇలాంటి తింటుంటారు. మరికొంతమంది టిపిన్ తినరు. కానీ చద్దన్నం తినే వారు తక్కువయ్యారు. ఒకప్పుడు చద్దన్నం ఎంతో ఇష్టంగా తినేవారు. రాత్రి మిగిలిన అన్నం దాచుకుని పొద్దున తినేదే 'చద్దన్నం'. పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. రోజంతా ఉత్తేజంగా..శక్తివంతంగా ఉండేవారని పెద్దలు చెబుతుంటారు. ఐరన్, పోటాషియం, క్యాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పెరుగు..ఉల్లిపాయ..పచ్చిమిరప కాయలతో చద్దన్నం తింటే వేడితత్వం తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఇస్తుంది. కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి. హై పటర్ టెన్షన్ ను గణనీయంగా తగ్గిస్తుంది. చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడంవల్ల ఆరోగ్యానికి కొత్త సమస్యలు వస్తాయి, అందువల్ల చద్దన్నాన్ని ఉదయాన్నే తినేయాలి.

Don't Miss