ఇంటర్నెట్ పై ఎక్కువ సమయం..జాగ్రత్త..

11:53 - September 29, 2017

ఇంటర్నెట్...ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. ఏ విషయాన్ని అయినా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేస్తున్నారు. కొంతమంది ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ లేకపోతే పనిచేయలేని వారు కూడా ఉంటుంటారు. కానీ అదే పనిగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే మానసిక రుగ్మతలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈఈడీఆర్ఎన్ (ఎథిలాజికల్ ఎల్యూసివ్ డిజార్డర్స్ నెటవర్క్) దీనిపై అధ్యయనం చేసిందంట. ఎక్కువ మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో ఆందోళన..చిరాకు..పరధ్యానం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని వెల్లడైంది.

ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల పలు అంశాలపై స్పందించాల్సి వస్తుంది. అంతేగాకుండా అనేక సున్నితమైన అంశాలను కూడా తెలుసుకుంటుంటారు. దీనివల్ల మానసిక..శారీరక రుగ్మతలకు దారి తీస్తుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ వ్యసనంగా మారితే జీవితాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అంబేద్కర్‌ బయోమెడికల్‌ రీసెర్చ్ సెంటర్‌, హర్యానాలోని నేషనల్‌ బ్రెయిన్‌ రీసెర్చ్ సెంటర్‌ నిపుణుల భాగస్వామ్యంతో దీనిపై అధ్యయనం చేస్తున్నారు. 

Don't Miss