కొన్ని వంటింటి చిట్కాలు..

13:26 - February 27, 2017

ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో వంటిల్లు కూడా ఒకటి. వంటిల్లు నుండే ఘుమఘుమలు వెళుతుంటాయి. కానీ వంట చేసే సమయం..ఇతరత్రా వాటిపై కొన్ని చిట్కాలు పాటిస్తే సమయం..శ్రమ రెండూ కలిసి వస్తాయి. అంతేగాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి.

  • ఐస్ క్రీమ్ కొని డీప్ ఫ్రీజ్ లో పెట్టడం వల్ల గడ్డ కడుతుంటే ఐస్ క్రీమ్ బాక్స్ ను ఓ కవర్ లో చుట్టి పెట్టి చూడండి..
  • చేపలు గ్రిల్ చేసే సమయంలో నిమ్మకాయ ముక్కలను పరచాలి. దానిపై చేప ముక్కలను పెట్టి గ్రిల్ చేస్తే చేపకు మంచి రుచి వస్తుంది.
  • నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది.
  • గుడ్లు బాగున్నాయా ? పాడైపోయాయా ? అనేది తెలుసుకోవాలంటే ఓ జగ్గులో నీళ్లు నిండా వేయాలి. తరువాత గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిలవచేసినదని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాదని అర్థం.
  • కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
  • ఫ్లాస్క్ ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుందా ? అయితే మజ్జిగతో కడిగి చూడండి.
  • బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
  • సాంబార్లో ఉప్పు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
  • అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.

Don't Miss