భూవివాదంలో తండ్రీకొడుకుల దారుణ హత్య...

12:13 - June 12, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో తండ్రీ కొడుకులను ప్రత్యర్థులు నరికి చంపేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లిలో ఈఘటన జరిగింది. గ్రామానికి చెందిన సవనపల్లి ఎల్లయ్య సోదరుడి నుంచి వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య, స్వామిలు కొనుగోలు చేశారు. 15ఏళ్ల క్రితమే సవనపల్లి యల్లయ్య సోదరుడు తన వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య, స్వామిలకు అమ్మాడు. అయితే అన్న మరణించడంతో అమ్మిన భూమి తనదేనని ఎల్లయ్య ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఎల్లయ్య ఆయన కుమారుడు శేఖర్‌ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నడానికి వెళ్లారు. ఇదే అదనుగా దేవయ్య, స్వామి దాడి చేశారు. గొడ్డళ్లతో ఎల్లయ్య, శేఖర్‌లను నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

 

Don't Miss