నటి సోనాలీ బింద్రేకు క్యాన్సర్‌

21:52 - July 4, 2018

ముంబై : బాలీవుడ్‌ అందాల నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. 'నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడిందని తెలిపారు.  కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలిసి ఆదరణ చూపుతున్నారు. వారంతా నా చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాన్సర్‌పై పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోనాలి బింద్రే 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై', 'సర్‌ఫరోష్‌' తదితర బాలీవుడ్‌ చిత్రాలతో పాటు 'ప్రేమికుల రోజు', 'మురారి', 'ఇంద్ర', 'ఖడ్గం' తదితర తెలుగు చిత్రాల్లోనూ నటించారు.

Don't Miss