ఇండియా వచ్చిన సోనాలి..ఆనందంలో అభిమానులు..

12:45 - December 3, 2018

ముంబై : సంకల్ప బలం వుంటే దేనైనా సాధించవచ్చు అనేది పెద్దల మాట. కష్టాలు వచ్చినియని కృంగిపోకుండా వాటిపై పోరాడి విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా వుంటుంది. ఏ కష్టమైనా రానీ నా ధైర్యం మాత్రం దిగజారిపోదు అనే మనోధైర్యంతో తనకు వచ్చిన దీర్ఘకాలిక వ్యాధితో పోరాడేందుకు సిద్ధమైంది బాలివుడ్ నటి సోనాలిబింద్రే. కొన్ని తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించి సోనాలి భయంకరమైన క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయినా తనకొచ్చిన వ్యాధితో పోరాడతానని దానికి సంబంధించిన వైద్యం చేయించుకునేందుకు విదేశం వెళ్లిన సోనాలి తిరిగి వచ్చింది అంతే ఆత్మవిశ్వాసంతో. దీనికి సంబంధించిన ఆమె ఫోటోలు ఇన్ స్ట్రా గ్రామ్ లో అభిమానులు పోస్ట్ చేయటంతో ఆమెపై ప్రశ్నంసల జల్లు కురుస్తోంది. 

ముంబైలో సోనాలి బింద్రే ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు ఆమె అభిమానులు. పైగా క్యాన్సర్ మహమ్మారితో ఆమె పోరాడిన విధానంపై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా ఏ రోజు కూడా భయపడలేదని.. తాను ధైర్యంగా పోరాడుతూ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె మనోధైర్యమే కాపాడిందని చెబుతున్నారు వైద్యులు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని సోనాలికి సూచించారు డాక్టర్లు. అవసరం అనుకున్నపుడు మళ్లీ న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోనుంది సోనాలి బింద్రే. కాగా ట్రీట్ మెంట్ నేపథ్యంతో తన వెంట్రుకలను కత్తిరించుకునే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన సోనాలి ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుని ముంబై రావటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తు ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆమె మరింత ఆరోగ్యంగా వుండాలని..ఆనందంగా వుండాలని పోస్ట్ లు పెడుతున్నారు. 

Don't Miss