విలువలతో కూడిన విద్య అవసరం : స్పీకర్

18:47 - February 13, 2018

గుంటూరు : విలువలతో కూడిన విద్య సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. విద్యార్థులు కష్టపడికాకుండా.. ఇష్టపడి చదవాలన్నారు. అనుకున్నది సాధించనంత మాత్రానా ఎవరూ కుంగిపోకూడదని చెప్పారు. జీవితాన్ని ఎవరూ అర్ధాంతరంగా ముగించవద్దన్నారు. గుంటూరులోని శ్రీవైష్ణవి అభ్యాస్‌ విద్యాసంస్థల వార్షికోత్స వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడెల.... విద్యార్థి భవిష్యత్‌కు ఇంటర్‌ విద్య ఎంతో కీలకమన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌...విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చదవాలని సూచించారు. అనంతరం ఓ పాటపాడి అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Don't Miss