మనసున్న మనిషి ఎంజీఆర్

18:51 - February 9, 2018

శ్రీకాకుళం : జిల్లా పాతపట్నం మండలం తారమ గ్రామానికి చెందిన ఇతని పేరు మామిడి గోవిందరావు.. ముద్దుగా అందరూ ఎంజీఆర్‌ అని పిలుచుకుంటారు... పేదరికంలో పుట్టిపెరిగిన ఈ యువకుడు.. కొంత కాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు.. ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి రాణించాడు. ఐనా ఏదో తెలియని వెలితి అతన్ని వెంటాడింది... అంతే తన మాతృభూమికి ఏదో చేయాలన్న ఆలోచనతో ముందగుడు వేశాడు. ప్రజలకు ఆసరాగా నిలిచాడు ప్రజాప్రతినిధులు ఎందరు మారినా... తామర, తీమర ప్రాంతాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న అవస్థలపై ఏ ఒక్కరూ స్పందించలేదు.. కానీ.. ఏ పదవీ లేకపోయినా.. జన్మభూమిలో సేవ చేసేందుకు ఎంజీఆర్‌ నడుంబింగించాడు. తన ప్రాంతవాసులకు నేనున్నానంటూ... ఆ పన్నహస్తం అందించాడు ఈ యువకుడు..

3 కిలోమీటర్ల దూరంలోని వంశధార నది
సొంత ఊరికి ఏదో చేయాలన్న తపనతో.. స్థానిక సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకున్నాడు ఎంజీఆర్... తాగునీటి కోసం దశాబ్దాలుగా ప్రజలు 3 కిలోమీటర్ల దూరంలోని వంశధార నదికి వెళ్తుండడం అతనికి తీవ్ర మనస్తాపం కలిగించింది.. తన చిన్న తనం నుంచి వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు సొంత నిధులను ఖర్చు చేశాడు. ఊళ్లోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు వేయించాడు. మామిడి గోవిందరావు చొరవ పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎంజీఆర్‌కు ఎలాంటి అధికారం, పదవి లేకున్నా.. ప్రజల్లో మాత్రం ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి. ప్రజాసేవకు పదవులు అవసరం లేదు.. మంచి చేయాలన్న తపన ఉంటే చాలు... సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయని నిరూపించాడు ఎంజీఆర్‌. గుడి, బడి, విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ... అన్ని విధాలా ప్రజలకు చేరువయ్యాడు. అలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.

తామర, తీమర గ్రామాలను దత్తత
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తామర, తీమర గ్రామాలను దత్తత తీసుకున్నాడు మామిడి గోవిందరావు.... వీటితో పాటు.. మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోని సమస్యలపై స్పందించారు ఎంజీఆర్. పరిష్కారం చూపిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్న ఇలాంటి వారు.. ఊరికొక్కరుంటే.. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగిపోయి.

Don't Miss