పెద్ద నోట్ల రద్దు..పసిడిపై ప్రభావం..

12:44 - November 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు నానా తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో కొంత ముట్టజెపుతామంటూ.. కమీషన్‌ దందాకు దిగుతున్నారు. అదేవిధంగా.. భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ బ్లాక్‌మనీని విదిలించుకునే పనిలో పడ్డారు. నల్లకుబేరుల నోట్ల కట్టలను హైదరాబాద్‌లోని బంగారు, వజ్రాల వ్యాపారులు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. 100 నోట్ల కట్టలతో వచ్చిన వారికి 10గ్రాముల బంగారాన్ని 33 వేలకు విక్రయిస్తుండగా... ఐదు వందలు, వేయి రూపాయల నోట్ల కట్టలతో వచ్చిన వారికి మాత్రం 10 గ్రాముల బంగారాన్ని 50 నుంచి 60 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బేగంబజార్‌, సిద్ధి అంబర్‌బజార్‌, బషీర్‌బాగ్‌, శాలిబండ, గుల్జార్‌హౌజ్‌, మహంకాళి వంటి ప్రాంతాల్లో జోరుగా బ్లాక్‌లో బంగారం విక్రయాలు జరుతున్నాయి. ఈ క్రమంలో నల్లకుబేరులు బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రియల్ వ్యాపారంపై ప్రభావం భారీగానే పడింది. ఇక పెద్దనోట్ల రద్దుతో బంగారం కొనుగోళ్ళపై ఎటువంటి ప్రభావం పడనుంది? ఇది వారికి లాభమా?నష్టమా? అనే అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో గోపీనాథ్ (ఈస్ట్ సిటీ జ్యువెలరీ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి),మధుకర్ రెడ్డి (ఎకనమిస్ట్ ) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నిపుణుల అభిప్రాయాలు..విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

Don't Miss