గ్రేటర్ ఎన్నికలు..65 సీట్లు వస్తాయి - ఎర్రబెల్లి...

గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పార్టీకి 65 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులని..ఇలా ఎన్నో పార్టీపై ముద్రలు వేసినా హైదరాబాద్, రంగారెడ్డిలో తమకు పట్టం కట్టారని తెలిపారు. విభజనకు వ్యతిరేకం కాదని, విభజన చేయడంలో తప్పు ఉందన్నారు. తెలంగాణకు ఒక కన్ను..ఆంధ్ర ప్రదేశ్ మరో కన్ను అని బాబు అన్నారు తప్పా ? అని ప్రశ్నించారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..

సెటిలర్లు...
నగరాన్ని టిడిపి తీర్చిదిద్దింది. ఇందుకోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేషన్ నిధులను మళ్లిస్తోంది. ఈ నిధులతోనే నగరం అభివృద్ధి చేయవచ్చు. సెటిలర్లు అనే ముద్ర వేయడం మంచిది కాదు. అయ్యప్ప సొసైటీలో ఇళ్లు కూల్చారు. ఓట్లను తొలగించారు. వారిని ఎన్నో అవమానాలకు గురి చేసింది. బయట నుండి వచ్చిన వారిని టిడిపి ఆదుకుంది. అక్కున చేర్చుకుంది. అయ్యప్ప సొసైటీని టార్గెట్ ఎందుకు చేశారు. అక్రమంగా ఎన్నో కట్టడాలు ఉన్నాయి కదా ? ఆంధ్రా ప్రాంతం వాళ్లు ఓట్లు వేయలేదనే కారణంతో ఈ పని చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకివ్వలే. ఫీజు రీయింబర్స్ మెంట్ అందరికీ ఇవ్వాలి. బీసీ కులాలను ఓసీల్లో కలిపారు. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్ ల్లో వీరు ఎక్కువగ నివాసం ఉంటున్నారు కనుకే ఈ పని చేశారు. కేసీఆర్ ఏం చేస్తున్నాడు ? 18 నెలలు అవుతుంది కదా. 300 ఇళ్లు కట్టి 30 లక్షల మందికి చూపెడుతున్నాడు. కళ్యాణలక్ష్మి ఎప్రిల్ నుండి ఇస్తారంట. నల్లా నీళ్లు ఇంతవరకు వచ్చాయా ? చెప్పిన మాటల్లో ఏదైనా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా ? సెక్రటేరియట్ మార్చాలని అనుకున్నారు. కూల్చవద్దని ఎంతో మంది చెప్పారు.

వలసలు..
చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అభిప్రాయ బేధాలు ఉంటాయి. కానీ పార్టీని వ్యతిరేకించరు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలంగా ఉంది. ఏ పార్టీని కూడా భూస్థాపితం చేస్తామన్నా అది వీలు కాదు. తమకు ప్రస్తుతం 65 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మిత్రపక్షమైన బీజేపీకి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. రంగారెడ్డి జిల్లాలో తాము బలంగా ఉన్నాం. టికెట్లు రాని వారు వలసలు వెళ్లిపోతుంటారు. లీడర్లు పోయినంత మాత్రనా కార్యకర్తలు, ఓటర్లు వెళ్లిపోరు.

హెచ్ సీయూ ఘటన..
కేంద్ర మంత్రి దత్తాత్రేయ మనస్తత్వం తెలిసిన వారు విమర్శించరు. విచారణ చేయండి అని నేను కూడా రాస్తాను. పెద్దగా తప్పుగా పరిగణించాల్సినవసరం లేదు. యాక్షన్ తీసుకోవాలని ఆయన లేఖలో రాయలేదని గమనించాను. రోహిత్ చనిపోవడం బాధాకరం. దీనిపై విచారణ చేయాలి. దీనిపై న్యాయం జరగాలి.

ఎర్రబెల్లికి ప్రాధాన్యత తగ్గడం..
అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ను. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో పనిచేసినా. ప్రస్తుతం గెస్ట్ ను మాత్రమే. ఎవరి బాధ్యతలు వారికున్నాయి. బంధువులు చనిపోతే వెళ్లాను. అందుకనే పొత్తు చర్చల్లో పాల్గొనలేదు. ఇదంతా పార్టీ ప్రెసెడింట్, వర్కింగ్ ప్రెసిడెంట్ చూసుకుంటారు.

గట్టిపోటినిచ్చేది టిడిపియే..
టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా పోటినిచ్చేది టిడిపి పార్టీయే. ఇది ఎన్నికల్లో తెలుస్తుంది. వంద స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాయం తీసుకుంటాం. ఆ మాట మీద నిలబెడుతాం. ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్ లకు రావాలని చెప్పాం. ఆరు స్థానాలు గెలిస్తే రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా వెళ్లిపోతాం అని చెప్పాం. కార్పొరేషన్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టనీయం. కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తాం' అని ఎర్రబెల్లి తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss