సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధుతో ప్రత్యేక ఇంటర్వ్యూ

రేపటి నుంచి హైదరాబాద్ లో సీపీఎం జాతీయ మహాసభలు జరుగున్నాయి. ఐదు రోజులపాటు సభలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ఏపీ రాష్ట్రకార్యదర్శి మధుతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో మతోన్మాద బీజీపీని ఓడించాలని అన్నారు. బీజేపీ పాలనలో దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని తెలిపారు. బీజేపీ పరిపాలనలో ప్రజలు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలకు తేడా లేదన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 
ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'దేశంలో చాలా సంక్షిష్ట పరిస్థితులు ఉన్నాయి. మతోన్మాదం ప్రజల్లో చిచ్చుపెడుతుంది. ఆర్థిక భారాలు, మతం పేరుతో ప్రజలను విభజన చేస్తున్నారు. ఈ మహాసభల్లో పోరాటాలకు దశ, దిశను నిర్ణయిస్తాం. ఈ మహాసభలకు ప్రాధాన్యత ఉంది. దేశ రాజకీయాలు మారుతున్నాయి. మతోన్మాద లౌకిక శక్తుల ఐక్యత కోసం పార్టీ కృషి చేస్తుంది. సరళీకరణ, మనోన్మాదంపై మేలవించి పోరాటాలు చేయాలి. బీజేపీ మతోన్మాద, నిరంకుశ శక్తిగా ఉంది. బీజేపీని ఎదుర్కోవడం ఏలా అనేది చాలా ముఖ్యమైన సమస్య. బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్సే కారణం. సరళీకరణ ఆర్ధిక విధానాలకు పునాది వేసింది  కాంగ్రెస్సే. బీజేపీ ఒంటిరి అయింది. ఎన్ డీఏలోని భాగస్వామ్య పక్షాలు బీజేపీతో విభేదిస్తూ దూరం అవుతున్నాయి. సూత్రబద్ధంగా లౌకిక ప్రజాస్వామ్యం కోసం నిలబడే విధంగా ప్రాంతీయ పార్టీలు లేవు. ప్రజా ఉద్యమాల ముందు ఏ ప్రభుత్వం తలవంచక తప్పదు..దిగి రాకతప్పదన్నారు అని అన్నారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss