ఎన్నికలకు అప్పుడే 'గులాబీ' రెడీ అవుతోంది...

06:49 - May 28, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీల నియామాన్ని చురుగ్గా చేపట్టి సాధారణ ఎన్నికలు ఎదుర్కొనేందుకు గులాబి దళపతి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు.

గులాబి దళపతి కేసీఆర్‌ మరో ఏడాదిలో ఎదుర్కోవాల్సిన ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతున్నారు. పార్టీ నేతలను క్రియాశీలం చేసేందుకు సిద్దమవుతున్నారు. కొత్త జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ నియమావళిని సవరించి... కమిటీల నియామకం ఉంటుందని గతంలో ప్రకటించినా... పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో కమిటీల నియామకంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను వారికి అప్పగించారు. కార్యదర్శులు మూడు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తుండగా... ప్రధాన కార్యదర్శులు 10 నియోజకవర్గాలపై పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే అప్పటికప్పుడు కమిటీలు వేస్తే పార్టీలో నేతల మధ్య మరింత ఆధిపత్య పోరు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ క్షేత్ర స్ధాయిలో బలోపేతం అయితే తప్ప ఎన్నికల్లో గెలవడం సాధ్యం అయేట్లు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా ప్రకారం 20 నుంచి 30 మంది ఓటర్లకు ఓ బూత్‌ కమిటీ సభ్యుడిని నియమించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బూత్‌ కమిటీలకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జగిత్యాల నియోజకవర్గంలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశానికి ఎంపీ కవితతో పాటు కార్యదర్శులు హాజరయ్యారు. వాయిస్‌ బూత్‌ కమిటీల సమావేశాలు మొదలు పెట్టడంతో.. గులాబిపార్టీ ఎన్నికలకు క్షేత్ర స్ధాయిలో రంగం సిద్ధం చేస్తోందనే సంకేతాలు ఇస్తోంది. 

Don't Miss