మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీని వీడనున్నారా ?

12:31 - June 13, 2018

ప్రకాశం : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి పార్టీని వీడనున్నారా? పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని మహానాడు వేదికపై అసమ్మతి తెలిపిన మాగుంట అసలు ఎటు వెళ్లనున్నారు. తిరిగి సొంత గూటికి వెళతారా? లేక వైసీపీ, జనసేన పార్టీలవైపు చూస్తున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల్లో ఆసక్తి రేకిస్తున్నాయి. మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీని వీడి వేరే పార్టీలోకి వెలుతున్నాడనే ప్రచారం ప్రకాశం జిల్లా టీడీపీ కార్యకర్తల్లో జోరుగా సాగుతుంది. 
ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ విడతున్నారనే ప్రచారం
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న గుర్తింపు అంత ఇంతకాదు. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాగుంట ఇప్పుడు టీడీపీలో ఇమడలేని పరిస్థితులు ఏర్పాడ్డాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఏకంగా తనకు అన్యాయం జరిగిందని మహానాడు వేదికపైనే గళం విప్పాడు మాగుంట శ్రీనివాస్‌రెడ్డి. అప్పటి వరకు అనుచరుల నోట వినబడ్డా  అసంతృప్తి మాట.. మహానాడు వేదికపై శ్రీనివాస్‌రెడ్డి అనటంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను దూమారం రేగుతుంది. ఈ మాటలు పార్టీలో కలకలం సృష్టించాయి. దీంతో మాగుంట పార్టీని విడతారనే ప్రచారం జోరుగా నేతల్లో జోరుగా సాగుతుంది. 
మాగుంట అనుచరుల అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న టీడీపీ జిల్లా నేతలు మాగుంటకు పెద్దగా విలవనివ్వటం లేదని ప్రధానంగా ఆయన అనుచరుల్లో వినిపిస్తున్న మాట. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంటకు మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి దానిని వెనక్కు తీసుకోవటంపై కూడా అనుచరులు మండిపడుతున్నారు. మంత్రి పదవి రాకపోవటానికి టీడీపీ జిల్లా నేతల కారణమని మాగుంటతో పాటు అనుచరులు బహిరంగగానే చెబుతున్నారు. పార్టీ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మొక్కుబడిగా పిలుస్తున్నారే తప్ప తనని పట్టించుకోవటం లేదని గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అధికారులు కూడ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మాగుంట వాపోతున్నారు. 
నన్ను బలిపశువును చేసేందుకే పోటీలో నిలుతున్నారంటున్న మాగుంట
మరోవైపు వైసీపీ నేతలు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు వస్తే ఒంగోలు నుంచి పోటీలో నిలబడలని మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని చంద్రబాబు కోరారు. అయితే తనని మరోసారి బలిపశువు చేసేందుకు టీటీపీ నాయకత్వం ఆలోచిస్తుందని మాగుంట అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే టీడీపీ తరుపున ఎవ్వరూ పోటీ చేసిన సహకరిస్తానని అంటున్నారు. ఏదీ ఏమైనా పార్టీలో నుంచి వెళ్లేపోవాలని మాగుంట శ్రీనివాస్‌రెడ్డి డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. తనకు తన కార్యకర్తలకు అధికారులు, నాయకులు విలువ ఇవ్వకపోవటం వల్లే మాగుంట విడుతున్నారనే ప్రచారం సాగుతుంది. 

 

Don't Miss