ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకమంట...

21:20 - August 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భీమా పథకం ఆగష్టు 15 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు భీమా అందే క్రమంలో దశల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణం చేత అయినా చనిపోతే ఎల్‌ఐసీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 10 రోజుల్లో రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించాలన్నారు. 

Don't Miss