ప్రచారం చేసిన ఫలితం శూన్యం

17:42 - February 9, 2018

హైదరాబాద్ : 

ఇపుడు దేశ వ్యాప్తంగా ప‌ట్టణాలు, న‌గ‌రాలు పెద్ద ప‌రీక్షను ఎదుర్కోంటున్నాయి. కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ స‌ర్వేక్షన్ ర్యాంకింగ్ లో అగ్రస్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. గ‌తేడాది మెట్రో న‌గ‌రాల్లో ప్రథ‌మ స్థానం కైవ‌సం చేసుకున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఈ సారికూడా టాప్ లిస్ట్ లో నిల‌వ‌డం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ప్రత్యేకంగా ప్రచారం...
టాప్‌ర్యాంకే లక్ష్యంగా సాగుతున్న జిహెచ్ఎంసి స్వచ్ స‌ర్వేక్షన్ కోసం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. కాని సిటి ప్రజ‌ల‌కు మాత్రం స్వచ్ స‌ర్వేక్షన్ అంటే ఏంటో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన కలిగడంలేదు. గ‌త సర్వేక్షణ్‌లో ఎంతగా ప్రచారం చేసినా.. సిటిజ‌న్స్ ఫిడ్ బ్యాక్, వ్యక్తిగ‌త మ‌రుగుదోడ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద మెత్తంలో మార్కులు కోల్పోయింది జీహెచ్‌ఎంసీ. అందుకే ఈసారి పౌరుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రావాలని బల్దియా అధికారులు గత మూడు నెలలుగా స్వచ్‌సర్వేక్షణ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆయా స్థానిక సంస్థల్లో చేపట్టిన స్వచ్చతా కార్యక్రమాల‌పై కేంద్రం బృందం అభిప్రాయాలు సేక‌రించ‌డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. బల్దియా అధికారులు అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ప్రజ‌లు నుంచి మాత్రం స్వచ్‌ సర్వేక్షణ్‌ అంటే ఏంటనే సమాధానాలే వ‌స్తున్నాయి.

3వేల 500 ట‌న్నుల చెత్త..
అయితే.. స్వచ్‌తా కార్యక్రమాల ప్రచారంపై జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్యంపై ప్రజల్లో అవగాహన వచ్చిందంటున్నారు. గ‌తంలో సిటివ్యాప్తంగా 3వేల 500 ట‌న్నుల చెత్తను సేక‌రిస్తుండ‌గా.. ప్రస్తుతం అది 4,500 ట‌న్నుల వ‌ర‌కు చేరిందంటున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేక‌రించ‌డం, వీదుల్లో చెత్త వేయకుండా తీసుకున్న చ‌ర్యల వ‌ల్ల ఇలాంటి మెరుగుద‌ల సాధ్యమైందంటున్నారు. ఇక గ‌తేడాది 434 ప‌ట్టణాల‌తో పోటి ప‌డ్డ హైద‌రాబాద్ 22వ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. కాని ఈ సారి 4296 ప‌ట్టణాలు న‌గ‌రాల‌తో పోటీ ప‌డుతోంది. అయితే స్వచ్ స‌ర్వేక్షన్ పై ప్రజ‌ల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవ‌గా రాలేదు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లో అవగాహనా రాహిత్యంవల్ల హైద‌రాబాద్‌కు వ‌చ్చే ర్యాంక్ పై ప్రభావం ప‌డే అవ‌కాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Don't Miss