నేతల మాటలు మూలేనా...?

20:37 - November 20, 2017

ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు..హామీలు గాల్లో మాటలయ్యాయి.. రాజధాని స్వప్నాలు, స్వర్ణాంధ్ర వాగ్దానాలు ప్రజల కళ్లముందే ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలతో, కుమ్మక్కులతో ప్రజలను మోసగించలేరు.. అందుకే ఈ అధ్యాయం ముగియలేదు.. ఈ పోరు ఆగలేదు.. అంటున్నాయి విపక్షాలు.. ఈ క్రమంలో ప్రత్యేక హోదా గురించి ఛలో అసెంబ్లీ పేరుతో జరిగిన ఉద్యమాన్ని పోలీసు జులుంతో అణచివేసే ప్రయత్నాలు శతవిధాలా చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సాధించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ హక్కు. కేంద్రంపై అందుకవసరమైన ఒత్తిడి తీసుకురావాలి. అయినా దిగి రాకపోతే కేంద్రంపై వత్తిడి పెంచాలి.. మాటలకు విమర్శలకు పరిమితం కాకుండా, అన్ని వర్గాలనూ కలుపుకుని కేంద్రంతో కొట్లాడి సాధించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉంది. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంపై సైలెంటయింది. దీనిపై విపక్షాలు మండి పడుతూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. కానీ, ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.

అడుగడుగునా అరెస్టులు..అక్రమ నిర్భంధాలు..పోలీసుల పహారాలు..ప్రత్యేక హోదా కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అణివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనేవారి అధ్యాయం ముగిసిపోతుందని వామపక్షనేతలు తేల్చి చెప్పారు.హామీలు ఘనంగా ఇచ్చి, ఆ తర్వాత కుంటిసాకులు చెప్తూ, కాలయాపన చేస్తూ, ఆఖరికి మొండిచేయి చూపిన తీరును ఎలా చూడాలి? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..చిత్తశుద్ధి లేకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో.. ఏపీ పట్ల కేంద్రం తీరు చూస్తే తెలిసిపోతుంది. హామీలు ఘనంగా ఇచ్చి, ఆ తర్వాత కుంటిసాకులు చెప్తూ, కాలయాపన చేస్తూ , చివరికి మొండిచేయి చూపి, ఒక రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదలటానికి ఎలా చూడాలి. ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని ఏమనాలి?

పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసిందనే విమర్శలు పెరిగాయి. కేంద్రం తీరుపై, విపక్షాల ఆందోళనపై ఏపీ సర్కారు తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అరెస్టులతో నిర్భంధాలో ఉద్యమాలను అణచివేయగలం అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ప్రజాబాహుళ్యంలో ఆకాంక్షల గురించి, ఉప్పెనలా ఎగసే ఉద్యమాలకు ప్రభుత్వాలు మట్టి కరిచిన తీరును చరిత్ర చెప్తుంది. ఇప్పుడు హామీలు, కల్లబొల్లి మాటలతో ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే జరిగే పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయని విపక్షాలంటున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

Don't Miss