మెట్రో రైలు సిద్ధము...

20:20 - November 27, 2017

మెట్రో రైలు పరుగులు తీసే సమయం దగ్గరకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న భాగ్యనగర వాసి పిల్లర్లపై పరుగులు తీసే మెట్రోలో పయనించబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో పాటు, మరికొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. సదుపాయాలు, పార్కింగ్ గురించి పలుప్రశ్నలు వినిపిస్తుంటే, అసలీ మెట్రో సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అనే సందేహాలూ.... టికెట్ రేట్లు అనూహ్యంగా పెంచిన తీరుపై విమర్శలూ వినిపిస్తున్నాయి. సో పరుగులు తీయనున్న మెట్రోపై ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూస్తున్న మెట్రో రైలు మరికొద్ది గంటల్లో నగరంలో పరుగులు పెట్టనుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి మెట్రో నగర ముఖ చిత్రాన్ని ఎలా మార్చనుంది.. ?మెట్రో స్టేషన్ల నిర్వహణ ఎలా ఉండబోతోంది? భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి. మానవ రహిత ఆటోమాటిక్ సిస్టమ్ లు ఎలా పనిచేస్తాయిదీనిపై మెట్రో వర్గాలేం చెప్తున్నాయి?

మెట్రో రైలు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా?నగర వాసులను ఊరిస్తూ వస్తున్న మెట్రో సాధారణ ప్రజానీకానిగా బరువుగా మారనుందా? అవునంటున్నారు ప్రజలు. టికెట్ రేట్లు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగా కనిపిస్తున్న తీరు నిరాశకు గురిచేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు మెట్రో రైలు టికెట్లు ఎలా ఉన్నాయి?దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశహర్మ్యాలూ విశాలమైన రోడ్లూ ఫ్లైఓవర్లతో నగర ముఖచిత్రం మారిపోయింది. నగరానికి సైబరాబాద్‌ అనుబంధమైంది. ప్రపంచ స్థాయి సంస్థలెన్నో నగరంలో తమ చిరునామా ఏర్పరచుకున్నాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, టూరిజం రంగాల్లో వేగంగా అభివృద్ధిని నమోదు చేస్తున్న నగర జనాభా ఇప్పటికే కోటి దాటుతోంది. ఈ తరుణంలో వస్తున్న మెట్రోపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో పార్కింగ్ లాంటి పలు సమస్యలకు ఇంకా సమాధానం కనిపించని పరిస్థితి ఉంది

రవాణా సదుపాయాలు పెరగటం ఏ నగరానికైనా మంచి విషయమే. అందునా, జనాభా విపరీతంగా పెరుగుతూ, వివిధరంగాల పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్న భాగ్యనగరంలో మెట్రో సదుపాయం రావటం ఉపయోగమే. కానీ, సామాన్యుడికి అందుబాటులో లేని అభివృద్ధి వల్ల ప్రయోజనాలు స్వల్పమే. అశేష ప్రజానీకం భరించగలిగేలా మెట్రో ఛార్జీలు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇలాంటి భారీ ప్రాజెక్టుల పరమార్ధం నెరవేరుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss