మనదేశానికి స్నేహితులెవరు..?

20:41 - January 17, 2018

నీ స్నేహితులెవరో తెలిస్తే నువ్వేంటో చెప్పొచ్చంటారు.. మరి మనదేశానికి స్నేహితులెవరు?మనం ప్రపంచానికి ఏ సంకేతాలిస్తున్నాం..? ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకుని, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావించే దేశానికి దగ్గరయ్యే ఆరాటం.. ఆ అగ్రరాజ్యానికి పావులా మారిన ఓ కిరాయి గూండాలాంటి దేశంతో ఇప్పుడు కొత్త స్నేహం.. మరి ఈ స్నేహాలు ఏ లక్ష్యం కోసం? ఈ అడుగులు ఏ గమ్యం వైపు? ఈ కావలింతలకు అర్ధమేంటి?  చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేది మరొకటి.. ప్రపంచానికి నీతులు చెప్పటమే తప్ప ఆచరణలో శూన్యం. ఇదీ అమెరికా తీరు. ఇక పెద్దన్న చెప్పినట్టు ఆడే ఇజ్రాయెల్...పాలస్తీనాను అణగదొక్కటంలో, నాశనం చేయటంలో ఆయుధంగా మారింది. కానీ, కొత్త కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి.. కొత్త కొత్త అడుగులు అర్ధంలేని గమ్యంవైపు కదులుతున్నాయి.. భారత ప్రభుత్వం అడుగులు కొత్త సంకేతాలిస్తున్నాయి.. మన పొరుగు దేశాలతో స్నేహం చేయటం తెలయదు.. కానీ, ఎక్కడో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం కావాలి.. పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, చైనా ఇలా అన్నింటికి దూరమౌతూ, అమెరికాకు దాని మిత్ర దేశాలకు దగ్గరవటం ఏ లక్ష్యం కోసం..? ఏ భావజాలం దీనికి కారణం అని చెప్పాలి?

నరహంతక దేశం.. అణచివేతే మార్గంగా బతుకుతున్న దేశం.. పరాయి నేలను దోపిడీచేసి బతుకుతున్న దేశం.. అలాంటి దేశానికి భారత్ దగ్గరవటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇజ్రాయెల్ తో భారత్ సంబంధాలు పెంచుకునే తీరుపట్ల అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అంతిమంగా దేశానికి చేటు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఇజ్రాయిల్ చరిత్ర ఏమిటి?అసలు పాలస్తీనా సమస్య ఎందుకొచ్చింది? కారణం ఎవరు? పాలస్తీనియుల బతుకులు ఎందుకిలా మారాయి అన్నిటికీ జియోనిజమే కారణమా? ఆ భావజాలమే పాలస్తీనాను ధ్వంసం చేస్తోందా? జియోనిజం అంటే ఏంటి?
 

వాస్తవాలు కళ్లముందున్నాయి. ఎవరి తీరేమిటో స్పష్టంగా కనిపిస్తోంది.. ఎవరి పీడన ఏమిటో... ఎవరి కన్నీళ్ల వెనుక ఏ క్రౌర్యం దాగుందో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. కానీ, ఏ ప్రయోజనాలకోసం ఈ కొత్త స్నేహాలు.. ఏ సైద్దాంతిక భూమికతో దోస్తీకోసం ఈ అడుగులు.. ?మన స్నేహాలే మనమేంటో చెప్తాయి. అది వ్యక్తికైనా, దేశానికైనా సరే. నూటికి నూరుపాళ్లూ నిజం. ఏ వాదాన్ని బలపరుస్తున్నాం... ఏ విధానాలను సమర్ధిస్తున్నాం .. అనే అంశంపైనే ఇదంతా ఆధారపడి ఉంది. ఇప్పుడు అలీనవిధానానికి, ప్రజాస్వామ్యయుత సంబంధాలకు, అణచివేతకు గురవుతున్న దేశాలకు మద్ధతు ఇచ్చే పరిస్థితి దూరంగా భారత్ జరగటం దేశ భవితపై ప్రభావం చేపే అవకాశాలు బలంగా ఉన్నాయి. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

 

 

Don't Miss