లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి

12:19 - February 7, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం సీతగొంది వద్ద జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. మరో ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌వాసులుగా గుర్తించారు. 

 

Don't Miss