ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ ఆత్మహత్య

09:13 - June 13, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భయ్యూజీ మహారాజ్‌ను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. ఆయన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించింది. జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సుసైడ్‌ నోట్‌లో ఉంది. సుసైడ్‌ నోట్‌తో పాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భయ్యూజీ మరణంపై  దర్యాప్తు చేపట్టారు. భయ్యూజీ తుపాకితో తనని తాను తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.  ఫోరెన్సిక్‌ బృందం సుసైడ్‌ నోట్‌పై దర్యాప్తు జరుపుతోంది.  భయ్యూజీ మహారాజ్‌కి రాజకీయాలతోనూ సంబంధాలున్నాయి. శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఇటీవల ఆయనకు కెబినెట్‌ మంత్రి హోదా పదవిని ఆఫర్‌ చేయగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. భయ్యూజీ మొదటి భార్య చనిపోవడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు.

 

Don't Miss